తన తొలి సంపాదన ఎంతో బయట పెట్టిన విద్యాబాలన్‌..

17 Jun, 2021 17:31 IST|Sakshi

ఎవరికైన తొలి సంపాదన చాల ప్రత్యేకమైనది. ప్రస్తుతం స్టార్‌ నటిగా కోట్ల రూపాయల్లో పారితోషికం అందుకుంటున్న బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ తాజాగా తన తొలి సంపాదన ఎంతో బయటపెట్టారు. ఆమె ప్రస్తుతం ‘షేర్నీ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తన తొలి రెమ్యునరేషన్‌ ఎంతో చెబుతూ అది ఎలా సంపాదించారో వివరించారు.

ఆమె మాట్లాడుతూ.. ‘ఓ టూరిస్టు క్యాంపైన్‌ కోసం మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చాను. నా స్నేహితులు, కజిన్స్‌తో కలిసి ఆ టూరిస్టు క్యాంపైన్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్నాను. ఈ ఫొటోషూట్‌లో మేమంతా ఓ చెట్టు పక్కన నిలుచుని చిరు నవ్వులు చిందిస్తూ ఫొటోకు ఫోజ్‌ ఇవ్వాలి. అలా ఫొటోలకు ఫోజులిచ్చినందుకు మాకు ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇచ్చారు. అదే నా తొలి సంపాదన’ అంటూ విద్యా బాలన్‌ చెప్పుకొచ్చారు. కాగా విద్యాబాలన్‌ ‘హమ్‌ పాంచ్‌’ సీరియల్‌తో నటిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. 

‘హమ్‌ పాంచ్‌ సీరియల్‌ కోసం తొలి అడిషన్‌ ఇచ్చాను. అప్పుడు మా అమ్మ, సోదరితో కలిసి ఆడిషన్‌కు వెళ్లాను. సుమారు 150 మంది వరకూ ఆడిషన్స్‌కి వచ్చారు. అంతమందిని అక్కడ చూసి ఇక నాకు అవకాశం రాదని ఫిక్స్‌ అయిపోయాను. అదృష్టం కొద్ది అందులో నటించే ఛాన్స్ నాకు వచ్చింది’ అని ఆమె చెప్పారు.  ఇకలేడీ ఓరియెంటెడ్ సినిమాలకు విద్యా బాలన్ కేరాఫ్ అడ్రస్‌గా మారారు. అప్పటి వరకు హీరోయిన్‌గా కాస్తా అవకాశాలు తగ్గిన విద్యాబాలన్‌కు ‘డర్టీ పిక్చర్’ మూవీతో మళ్లీ సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ ఆమె వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు