ఎంఎస్‌ ధోనీతో దళపతి విజయ్‌.. ఫోటోలు వైరల్‌

12 Aug, 2021 16:20 IST|Sakshi

చెన్నై: తమిళ స్టార్‌ హీరో విజయ్‌కు టీం ఇండియా మాజీ కెప్టెన్‌  ఎంఎస్‌ ధోని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ప్రస్తుతం విజయ్‌ బీస్ట్‌ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా చెన్నైలోని గోకులం స్టూడియోలో దీనికి సంబంధించిన షూటింగ్‌ జరుగుతుంది. అయితే ఓ యాడ్‌ షూటింగ్‌లో భాగంగా ధోనీ సైతం అక్కడే షూట్‌లో పాల్గొన్నట్లు తెలుస్తుంది.


దీంతో బీస్ట్‌ సినిమా సెట్‌ను సందర్శించాడు మహేంద్ర సింగ్‌ ధోనీ. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాల్‌ వైరల్‌ అవుతున్నాయి. లెజెండ్స్‌ ఇద్దరు ఇకే ఫ్రేములో కనిపించడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.


 

మరిన్ని వార్తలు