సూపర్‌ క్రేజ్‌.. 1.7 మిలియన్‌ లైక్స్‌

24 Aug, 2020 19:43 IST|Sakshi

కరోనా ఎఫెక్ట్‌తో‌ షూటింగ్‌లకు తాత్కాలికంగా విరామం దొరకడంతో హీరోలు, హీరోయిన్లు ఇళ్ల దగ్గరే తమకు నచ్చిన వ్యాపకాలతో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ తన పెంపుడు కుక్కలతో టైం పాస్‌ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు విజయ్‌. ఇప్పటికే ఈ ఫోటోను 1.7 మిలియన్ల మంది లైక్‌ చేశారు. దీనిలో విజయ్‌ తన పెంపుడు కుక్కలు స్టార్మ్‌‌, చెస్టర్లతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు. ‘చిల్లింగ్‌ విత్‌ దిస్‌ బాయ్స్‌’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. గత నెల తొలిసారి స్టార్మ్‌ ఫోటోను షేర్‌ చేశారు విజయ్‌. (అవకాశాలు అంత తేలికకాదు..)

Chilling with these boys @thestormdeverakonda and @chester.thesamoyed.

A post shared by Vijay Deverakonda (@thedeverakonda) on

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్‌’ సినిమాలో నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు