"వినరో భాగ్యము విష్ణు కథ" నుంచి మరో లిరికల్‌ సాంగ్‌ విడుదల

30 Jan, 2023 08:47 IST|Sakshi

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీవాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు.కిరణ్ సరసన  క‌శ్మీర ప‌ర్ధేశీ నటిస్తోంది.

తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఇప్పటికే రిలీజైన  "వాసవసుహాస" "బంగారం" పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా మరో లిరికల్‌ దర్శన సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. భాస్కర భట్ల రవికుమార్ రచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు