మహేశ్‌బాబుతో సినిమాపై స్పందించిన మణిరత్నం

10 Jul, 2021 09:39 IST|Sakshi

స్టార్ డైరెక్టర్ మణిరత్నం, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబో ఓ సినిమా వస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. మహేశ్‌కు మణిరత్నం ఓ మంచి కథ వినిపించారని, దానికి సూపర్‌ స్టార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే పుకార్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ పుకార్లపై మణిరత్నం స్పందించారు. మహేశ్‌కు తాను కథ చెప్పడం నిజమేనని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.

మహేశ్ కథ విన్నారని.. కానీ, కొన్ని కారణాల వల్ల అది వర్కవుట్ కాలేదని ఆయన స్పష్టం చేశారు. కథలను బట్టే నటీనటులను ఎంపిక చేసుకుంటాను అని త్వరలోనే తెలుగులో ఓ సినిమా చేస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. ఏ విషయానికైనా.. సమయం.. సందర్భం రావాలని ఆయన అన్నారు.మరి మహేశ్‌తో సినిమా చేసే  ఆ సమయం ఎప్పుడు వస్తుందో .. ఆ సందర్భం ఇప్పుడు కుదురుతుందో చూడాలి.

ఇక మహేశ్‌ ప్రస్తుతం పరుశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చేస్తున్నాడు. కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, 14రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్‌తో ఓ సినిమాతో చేయబోతున్నాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు