శవం ముందు నటి డ్యాన్స్‌, అవాక్కైన నెటిజన్లు

27 Jun, 2021 10:32 IST|Sakshi

పాట విన్నా, సంగీతం చెవిన పడినా కొందరికి కాళ్లు ఆగవు. ఎవరేమనుకుంటారు అనేదాన్ని పక్కనపెట్టి వాళ్లకు నచ్చిన రీతిలో దుమ్మురేపే రేంజ్‌లో డ్యాన్సులు చేస్తుంటారు. తెలుగు నటి నందినీ రాయ్‌ కూడా ఇదే కోవలోకి చెందుతుంది. 'ఇన్‌ ద నేమ్‌ ఆఫ్‌ గాడ్‌' వెబ్‌ సిరీస్‌లో నటించిన ఆమె ఈ సిరీస్‌ షూటింగ్‌ మధ్యలో చేసిన అల్లరి పనులకు సాంపుల్‌గా ఓ వీడియోను షేర్‌ చేసింది. అందులో పాత చీర కట్టుకున్న నందినీ ధనుష్‌ 'జగమే తంత్రం' సినిమాలోని రకిట రకిట పాటకు వీర లెవల్లో స్టెప్పులేసింది.

నచ్చిన పాటకు డ్యాన్స్‌ చేయడంలో ఆశ్చర్యమేముందీ అనుకుంటున్నారేమో.. అక్కడికే వస్తున్నాం.. ఆమె ఆషామాషీగా చిందులేయలేదు. ఓ శవం ముందు డ్యాన్స్‌ చేసింది! అయితే అక్కడ నిజంగా ఎవరూ చనిపోలేదు, కేవలం అది షూటింగ్‌లో భాగంగా వేసిన సెట్‌. కానీ చాలామంది నెటిజన్లకు ఈ ఐడియా నచ్చనేలేదు. దీంతో కొందరు ఆమెను సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. డెడ్‌ బాడీ ముందు డ్యాన్స్‌ ఏంటి?, అది కేవలం సెట్టే కావచ్చు, అయినా అక్కడ అలా డ్యాన్స్‌ చేయడం ఏమీ బాగోలేదు అంటూ పెదవి విరుస్తున్నారు. మరికొందరు మాత్రం డ్యాన్స్‌ అదిరింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

A post shared by Nandini Rai (@nandini.rai)

చదవండి: 

మరిన్ని వార్తలు