సుశాంత్‌ సింగ్‌ స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చా: హీరో సన్ని

17 Aug, 2021 08:03 IST|Sakshi

‘నా ప్రయాణం మీడియా నుంచే ప్రారంభమైంది. నేను సినిమాల్లోకి రావడానికి హీరో సుశాంత్‌ సింగ్‌ రాజపుత్‌గారే స్ఫూర్తి. ముందు సీరియల్‌లో లీడ్‌ ఆర్టిస్ట్‌గా చేశాను. ఆ తర్వాత హీరోగా ‘సకల గుణాభి రామ’ చిత్రం చేశాను. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని హీరో వీజే సన్ని అన్నాడు. వెలిగొండ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘సకల గుణాభి రామ’. వీజే సన్నీ, శ్రీతేజ్, ఆషిమా నర్వాల్, తరుణి హీరో హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని వి. సంజీవ రెడ్డి నిర్మించారు.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘భార్యా భర్తల మధ్య ఎమోషన్స్, రొమాన్స్‌తో పాటు కామెడీ నేపథ్యంలో జరిగే సినిమా ఇది’ అని చెప్పాడు. త్వరలోనే తమ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత సంజీవ రెడ్డి తెలిపాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు