వక్తిగత కారణాలతో యువకుడు.. రైలు కింద పడి..!

7 Nov, 2023 11:07 IST|Sakshi

మిర్యాలగూడ అర్బన్‌: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేష్‌(30) అనే అనాథ యువకుడు మిర్యాలగూడ పట్టణంలోని లారీ అసోసియేషన్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం అతడు వ్యక్తిగత కారణాలతో మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో జన్మభూమి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు.

ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

దొంగతనం కేసులో జైలు శిక్ష
రామగిరి(నల్లగొండ):
ఆటో దొంగతనం కేసులో ఓ వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ కోర్టు జడ్జి కె. శ్రీవాణి సోమవారం తీర్పు వెలువరించారు. వివరాలు.. నల్లగొండ పట్టణానికి చెందిన మహ్మద్‌ రఫీక్‌ మొయినుద్దీన్‌ తన ఆటోను మీర్‌బాగ్‌కాలనీలో నివాసం ఉంటున్న ఎండీ. హజీకి కిరాయికి ఇచ్చాడు. హజీ 2023 జూన్‌ 22న రాత్రి తన ఇంటి ముందు పార్కింగ్‌ చేశాడు.

మరుసటి రోజు ఉదయం చూసే సరికి ఇంటి ముందు ఆటో కనబడలేదు. ఆటో యజమాని రఫీక్‌కు విషయం తెలియజేయడంతో నల్లగొండ టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన మహ్మద్‌ సలీం వద్ద ఆటో ఉన్నట్లు తెలిసింది. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సోమవారం పబ్లిక్‌ ప్రొసిక్యూటర్‌ వాదనలతో ఏకీభవించిన జడ్జి కె. శ్రీవాణి నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.

మరిన్ని వార్తలు