ఎన్‌కౌంటర్‌: ముగ్గురు లష్కరే ఉగ్రవాదుల హతం

19 Feb, 2021 10:28 IST|Sakshi

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా బుద్గాం ప్రాంతంలో గురువారం అర్దరాత్రి ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. అలాగే భారత్‌ జవాన్‌ మృతి చెందగా, మరో జవాన్‌కు గాయాలయ్యాయి. షోపియాన్ ప్రాంతంలోని బడిగాంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో జమ్మూకశ్మీర్ పోలీసులు సైనికులు, సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి గురువారం అర్దరాత్రి కార్డన్ సెర్చ్ ప్రారంభించారు.

ఒక ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు వారిని గాలిస్తున్న భద్రతా బలగాలపై కాల్పులకు దిగారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించారని పోలీసులు చెప్పారు. యూరప్, ఇస్లామిక్ దేశాల ప్రతినిధులు, రాయబారుల బృందం జమ్మూకశ్మీర్ లో సందర్శిస్తున్న సమయంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్ స్థలంలో పోలీసులు ఉగ్రవాదుల కోసం శుక్రవారం ఉదయం కూడా గాలింపు కొనసాగిస్తున్నారు. 
చదవండి: ఏనుగులు దాడి: యువకుడి మృతి
గల్వాన్‌ ఘటన: తొలిసారి వివరాలు వెల్లడించిన చైనా

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు