కుంభమేళా నుంచి వచ్చిన 99 శాతం మందికి కరోనా

2 May, 2021 19:38 IST|Sakshi

భోపాల్: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుంది. ఇటువంటి సమయంలో మధ్యప్రదేశ్ నుంచి ఒక షాకింగ్ రిపోర్ట్ విడుదలైంది. ఈ రిపోర్ట్ లో హరిద్వార్ కుంభమేళా నుంచి తిరిగి వచ్చిన 99 శాతం మందికి కుంభం కరోనా వైరస్ సోకినట్లు తేలింది. కుంభమేళా నుంచి వచ్చిన 61 మందిలో 60 మంది యాత్రికులకు పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కుంభమేళాలో పాల్గొని రాష్ట్రానికి తిరిగివచ్చిన వారిలో మరికొందరిని ఇంకా గుర్తించకపోవడంతో వారి ద్వారా వైరస్ సంక్రమణపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్‌-19 కేసులు వేగంగా పెరగడంతో ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన సమావేశాలలో ఒకటైన కుంభమేళా నుంచి తిరిగివచ్చిన యాత్రికులు 14 రోజులు విధిగా క్వారంటైన్‌లో ఉండాలని పలు రాష్ట్రాలు నిర్ధేశించాయి. ఢిల్లీ ప్రభుత్వం కుంభమేళా నుంచి వచ్చిన వారు కచ్చితంగా 14 రోజులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని పేర్కొంది.

చదవండి:

కరోనా: చెత్తకుప్పలో మెతుకులే పరమాన్నం

మరిన్ని వార్తలు