‘ఏపీ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదు’

8 Aug, 2022 19:06 IST|Sakshi

ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఎలాంటి సందర్భాలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేవని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు. స్పిల్‌వే, అప్‌స్ట్రీమ్‌ కాఫర్‌ డ్యామ్, కాంక్రీట్‌ డ్యామ్‌ (గ్యాప్‌–3), డయాఫ్రమ్‌ వాల్‌ ఆఫ్‌ ఎర్త్‌ కమ్‌ రాక్‌–ఫిల్‌ డ్యామ్‌–ఈసీఆర్‌ఎఫ్‌ (గ్యాప్‌–3) వంటి  అనేక కీలక నిర్మాణాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు.  టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు.

ఈ ఏడాది జూన్‌ వరకు హెడ్‌ వర్క్స్‌ 77%, ఎడమ మెయిన్‌ కెనాల్‌ 72%, కుడి మెయిన్‌ కెనాల్‌ 93% పనులు పూర్తయ్యాయని అన్నారు.  కాగా, పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ కంటే ముందుగానే పార్లమెంట్‌ సమావేశాలు ముగిశాయి. 

మరిన్ని వార్తలు