జ్ఞానవాపి మసీదులో రెండోరోజూ సర్వే

6 Aug, 2023 06:29 IST|Sakshi

వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) అధికారుల సర్వే రెండో రోజూ కొనసాగింది. హిందూ ఆలయ నిర్మాణంపైనే 17వ శతాబ్దంలో ఈ మసీదును నిర్మించారనే పిటిషన్‌పై వారణాసి కోర్టు శాస్త్రీయ సర్వేకు ఆదేశించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వే పనులు సాగాయి.

ఏఎస్‌ఐ అధికారులతోపాటు ప్రభుత్వ న్యాయవాది రాజేశ్‌ మిశ్రా, ఐఐటీ కాన్పూర్‌ నిపుణులు, అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ సభ్యులు అక్కడున్నారు. ఆదివారం కూడా సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సర్వేకు పూర్తిగా సహకరిస్తున్నట్లు మసీదు కమిటీ తెలిపింది.  మసీదులో శాస్త్రీయ సర్వే జరపాలంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచి్చన ఆదేశాలను అలహాబాద్‌ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు సమరి్థంచడం తెలిసిందే. సెప్టెంబర్‌ 4 లోగా సర్వే పూర్తి చేయాలని శుక్రవారం వారణాసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు