ఆటో డ్రైవర్‌కు రూ.25 కోట్ల లాటరీ

19 Sep, 2022 06:17 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలోని శ్రీవరాహం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ అనూప్‌కు ఓనమ్‌ బంపర్‌ లాటరీలో రూ.25 కోట్ల జాక్‌పాట్‌ తగిలింది.   మలేసియా వెళ్లి చెఫ్‌గా స్థిరపడాలనుకుని ఏర్పాట్లు చేసుకుంటున్న ఇతడు 22 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొని అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.

అన్ని పన్నులు పోను అనూప్‌ చేతికి రూ.15 కోట్లు అందుతాయని నిర్వాహకులు చెప్పారు. ఈ డబ్బుతో అప్పులు తీర్చి, ఇల్లు కట్టుకుంటానని అనూప్‌  తెలిపాడు.
 

మరిన్ని వార్తలు