శతమానం భారతి: పరిరక్షణ

7 Aug, 2022 13:39 IST|Sakshi

ప్రకృతి, నేల, పర్యావరణం భారతదేశానికి కేవలం పదాలు కాదు. సంస్కృతి, ధర్మంతో ముడివడి ఉన్న దైవత్వ అంశాలు. పర్యావరణ పరిరక్షణకు భారత్‌ కొన్ని సంవత్సరాలుగా పాటిస్తున్న నిబద్ధతను ప్రపంచం అంతా ఆసక్తికరంగా గమనిస్తూ ఉంది. 2021వ సంవత్సరంలో గ్లాస్గోలోజరిగిన సి.ఒ.పి. (కాప్‌) 26 వ సమావేశం.. భూతాపోన్నతిని తగ్గించే విషయమై భారత్‌ ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావించింది.

ప్రధాని మోదీ ఇచ్చిన ‘లైఫ్‌’ (లైఫ్‌స్టయిల్‌ ఫర్‌ ఇన్విరాన్‌మెంట్‌) పిలుపును ప్రపంచం ఒక ఉద్యమంగా మార్చుకుంది. గత కొన్నేళ్లుగా నేల ఆరోగ్యం క్షీణించడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతూ వస్తున్న నేపథ్యంలో భారత్‌ ఈ ‘మిట్టీ బచావో’ను చేపట్టింది. సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తోంది.

ఇవేకాక, పర్యావరణ పరిరక్షణకు మరికొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకుంది. 37 కోట్ల ఎల్‌.ఇ.డి. బల్బులను ఇప్పటి వరకు పంపిణీ చేసింది. 5 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేసింది. 4 కోట్ల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ను  తగ్గించగలిగింది. గంగానది పునరుజ్జీవనానికి బడ్జెట్‌లో పెద్ద మొత్తాలను కేటాయించింది. రాజస్థాన్‌లోని భడ్లాలో ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్‌ పార్క్‌ ప్రారంభం కూడా పర్యావరణ పరిరక్షణలో భాగమే. భారత శత స్వాతంత్య్రోత్సవాల నాటికి భూమి వెచ్చదనాన్ని తగ్గించి, పచ్చదనాన్ని పెంచేందుకు భారత్‌ కృషి చేస్తోంది.
చదవండి: మహోజ్వల భారతి: జాతీయోద్యమ కవియోధుడు 

మరిన్ని వార్తలు