స్వతంత్ర భారతి 1986/2022

10 Jul, 2022 16:47 IST|Sakshi

పి.ఐ.ఎల్‌. (ప్రజాహిత వ్యాజ్యం)
1985లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి పి.ఎన్‌.భగవతి భారత న్యాయవ్యవస్థలో ప్రజాహిత వ్యాజ్యాన్ని (పి.ఐ.ఎల్‌.) ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్నారు. దీనిని ప్రవేశపెట్టడంలోని అసలు భావన సామాన్య పౌరులకు న్యాయం అందేటట్లు చూడటం. కానీ, 1990ల మధ్య నాటికి ఈ వ్యాజ్యాలు న్యాయ రంగాన్ని మార్చేశాయి. వరుసగా దాఖలైన అనేక ప్రజాహిత వ్యాజ్యాలు అత్యంత ప్రాచుర్యం సంపాదించుకున్నాయి. పి.వి.నరసింహా రావు–జె.ఎం.ఎం. ముడుపుల కేసు, జైన్‌ హవాలా వివాదం, సతీశ్‌ శర్మ పెట్రోల్‌ పంపుల కుంభకోణంలో న్యాయ పోరాట యోధుడు హెచ్‌.డి. శౌరి  పి.ఐ.ఎల్‌  పిటిషన్‌లు దాఖలు చేశారు.

ఇక పర్యావరణ పరిరక్షణ పట్ల శ్రద్ధ వహించే న్యాయవాది ఎం.సి.మెహతా పి.ఐ.ఎల్‌.ను ఆయుధంగా చేసుకునే తాజ్‌మహల్‌ చుట్టుపక్కల కాలుష్యం కలుగజేసే పరిశ్రమలు లేకుండా చేయడంలో విజయం సాధించారు. మహారాష్ట్రలోని ఎన్‌రాన్‌ ప్రాజెక్టు పైన కూడా అనేక ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. అనేక కేసులలో అవి న్యాయశాస్త్ర రంగంలో చరిత్రను సృష్టించాయి. పౌర అధికారులు, స్థానిక ప్రభుత్వాలు దృష్టి పెట్టడంలో విఫలమైన సమస్యలను పరిష్క రించడంలో ఈ వ్యాజ్యాలు నిర్వహించిన పాత్ర సంతోషించ తగినది. న్యాయ వ్యవస్థ ప్రజాపక్షం వహించడానికి పి.ఐ.ఎల్‌.లు కీలక సాధ నంగా ఉపకరిస్తున్నాయి. 

ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు
– ఇండియన్‌ ఆర్మీ 13వ చీఫ్‌ గా పనిచేసిన ఎ.ఎస్‌.వైద్య హత్య. ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు ప్రతీకారంగా ఆయన పదవీ విరమణ అనంతరం ఈ హత్య జరిగింది.
– ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ తర్వాత కూడా స్వర్ణదేవాలయంలోని అఖల్‌ తఖ్త్‌ ప్రాంగణంలో తిరిగి తలెత్తిన తీవ్రవాద కలాపాలు.

మరిన్ని వార్తలు