Mamata Banerjee: భారీ మెజార్టీతో మమతా బెనర్జీ విజయం

3 Oct, 2021 15:15 IST|Sakshi

భవానీపూర్‌ ఉపఎన్నికలో మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్‌పై 58,389 ఓట్ల మెజార్టీతో దీదీ ఘనవిజయం సాధించారు.  తొలి రౌండ్‌ నుంచి 21వ రౌండ్‌ వరకూ మమత స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. భవానీపూర్‌ ఉప ఎన్నికల్లో మమతాకు 84,709 ఓట్లు రాగా, ప్రియాంక టిబ్రీవాల్‌కు 26,320 ఓట్లు వచ్చాయి.  కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్‌ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్‌ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 

►19 రౌండ్లు ముగిసేసరికి మమత 50వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

►11 రౌండ్లు పూర్తయ్యేసరికి మమత 34వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

►11వ రౌండ్‌ ముగిసే సమయానికి మమతకు 45,874 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌కు 11,892 ఓట్లు వచ్చాయి. 

►బెంగాల్‌లో ఉపఎన్నిక జరుగుతున్న మరో రెండు చోట్ల జంగీపుర్‌, సంషేర్‌గంజ్‌ స్థానాల్లోనూ టీఎంసీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

►ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి మమత 25వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

► నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి మమత 14,435 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

► మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్‌పై మమత 6,146 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

►భవానీపూర్‌ అసెంబ్లీ నియోజకరవర్గ ఉపఎన్నికలో మమతా బెనర్జీ 2,799 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్‌ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 30న జరిగిన ఉప ఎన్నికల్లో 57 శాతం పోలింగ్‌ నమోదయ్యిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కాగా, మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్సష్టత వచ్చే అవకాశం ఉంది. ఉపఎన్నికలో మమతపై బీజేపీ అభ్యర్థిగా న్యాయవాది ప్రియాంక పోటీలో ఉన్నారు.

భవానీపూర్‌  నియోజకవర్గం అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి(టీఎంసీ) కంచుకోటగా ఉంది.  కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్‌ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్‌ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేశారు. 

మరిన్ని వార్తలు