ఏడేళ్లకు వచ్చిన అడ్మిట్‌ కార్డ్‌: షాకైన బెంగాలీ బాబు

4 Nov, 2023 21:21 IST|Sakshi

  తనకు జరిగిన అన్యాయంపై  న్యాయం కావాలంటున్న ఆశిష్‌ బెనర్జీ

కోల్‌కతా:  పశ్చిమ బెంగాల్‌లోని వ్యవసాయ శాఖలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది.  వ్యవశాయ శాఖలో ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న 7 సంవత్సరాల తర్వాత ఆ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు వచ్చింది. దీంతో అది చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఆశ్యర్యకరమైన పరిణామం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.  అటు రాజకీయంగా కూడా ఈ ఘటన  రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.   

ఇండియా టుడే కథనం ప్రకారం 2016 లో పశ్చిమ బెంగాల్‌లోని వ్యవసాయ శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. అసిస్టెంట్ పోస్టుకు ఆ ఏడాది మార్చిలో వార్తాపత్రికలో ప్రకటన వచ్చింది.  ఈ నోటిఫికేషన్‌ను  చూసి ఆశిష్ బెనర్జీ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు  వర్ధమాన్ జిల్లాకు చెందిన ఆశిష్ బెనర్జీ. పరీక్ష డిసెంబర్ 18, 2016న జరగాల్సి ఉంది. కానీ దీనికి సంబంధించిన అడ్మిట్‌ కార్డు లేదా హాల్‌ టికెట్‌ రాలేదు. దీని కోసం కొన్నాళ్లు ఎదురుచూసి, ఇక దాని సంగతే మర్చిపోయాడు. కానీ ఆశ్యర్యకరంగా దాదాపు ఏడేళ్ల తరువాత షాక్‌య్యే ఘటన చోటు చేసుకుంది.   (80 కోట్లమంది పేదలకు ప్రయోజనం: ప్రధాని మోదీ కీలక ప్రకటన)

ఇటీవల (2023 నవబంరు 1వ తేదీ) ఆశిష్‌ బెనర్జీకి పశ్చిమ బెంగాల్ వ్యవసాయ శాఖ నుంచి ఒక సీల్డ్ కవరు అందింది. దాని లోపల ఏడేళ్ల క్రితం జరిగిన పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ ఉంది. దీంతో ఇంత కాలానికా.. జీవిత కాలం లేటు అన్నట్టుగా  ఆశ్చర్యపోవడం ఆశిష​ బెనర్జీ వంతైంది. ఇందులో ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే   2016 డిసెంబరు 18 వ తేదీనే నిర్వహించడం, పరీక్ష రాసి, సెలక్ట్ అవ్వడం, వారు ఉద్యోగంలో చేరిపోవడం అన్నీ జరిగిపోయాయి.  (షాకింగ్‌ వీడియో: ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం, ఒకరు మృతి)

దీంతో ఈ వ్యవహారంపై ఆశిష్‌ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాడు. తనకు అడ్మిట్ కార్డు ఆలస్యం కావడానికి కారణం ఏమిటో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశాడు. చేయని తప్పుకు తాను మూల్యం చెల్లించాల్సి వచ్చిందని తప్పు ఎవరిదో  తేలాలని పట్టుబడుతున్నాడు. అంతేకాదు  రాష్ట్రంలోని ఇతర ఉపాధి స్కామ్‌ల మాదిరిగానే ఈ కేసులో కూడా కుంభకోణం జరిగిదంటే  ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆశిష్.

మరిన్ని వార్తలు