కొత్త ఐటీ చట్టంలో అంశాలపై బాంబే హైకోర్టు స్టే

15 Aug, 2021 08:20 IST|Sakshi

కొత్త ఐటీ చట్టంలోని కొన్ని అంశాలపై బాంబే హైకోర్టు స్టే 

ముంబై: కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రూల్స్‌–2021లో కొన్ని అంశాలపై బాంబే హైకోర్టు శనివారం మధ్యంతర స్టే విధించింది. ఆన్‌లైన్‌ ప్రచురణకర్తలంతా నైతిక నియమావళి, ప్రవర్తనా నియమావళి కచ్చితంగా పాటించాలని ఐటీ రూల్స్‌లో పొందుపర్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనలపై న్యాయస్థానం మధ్యంతర స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

కొత్త ఐటీ చట్టంలోని క్లాజ్‌ 9 కింద పేర్కొన్న సబ్‌ క్లాజెస్‌ 1 అండ్‌ 3లపై స్టే విధిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ సబ్‌క్లాజ్‌లు పిటిషనర్‌ వాక్‌ స్వాతంత్రపు హక్కును హరిస్తున్నట్లుగా తాము ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నట్లు తెలిపింది.

కొత్త ఐటీ రూల్స్‌లోని నిబంధనలను సవాలు చేస్తూ లీగల్‌ న్యూస్‌ పోర్టల్‌ ‘ద లీఫ్‌లెట్‌’, జర్నలిస్టు నిఖిల్‌ వాగ్లే బాంబే హైకోర్టులో  పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది. పిటిషనర్ల వాదనలో ఏకీభవించింది. వివాదాస్పద కొత్త ఐటీ నిబంధనల్లోని సబ్‌ క్లాజ్‌లపై మధ్యంతర స్టే విధించింది. 

చదవండి : 53 కోట్లు దాటిన వ్యాక్సినేషన్‌

మరిన్ని వార్తలు