Chandrayaan-3: ల్యాండర్‌ నుంచి చంద్రుడిపైకి ప్రజ్ఞాన్‌

26 Aug, 2023 04:12 IST|Sakshi
చంద్రుడి ఉపరితలంపై దిగిన ల్యాండర్‌ నుంచి బయటకు వస్తున్న రోవర్‌ ప్రజ్ఞాన్‌

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/బెంగళూరు: చంద్రయాన్‌–3 మిషన్‌లో భాగంగా చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై విజయవంతంగా అడుగుపెట్టిన ల్యాండర్‌ విక్రమ్‌ నుంచి ఆరు చక్రాలతో కూడిన రోవర్‌ ప్రజ్ఞాన్‌ బయటకు వస్తున్న వీడియోను, ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. వీటిని ‘ఎక్స్‌’లో షేర్‌ చేసింది. ఈ వీడియో, ఫొటోలను విక్రమ్‌లోని ల్యాండర్‌ ఇమేజర్‌ కెమెరా వీటిని చిత్రీకరించింది.

ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుడి ఉపరితలంపై పాదం మోపిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్‌ పూర్తయ్యాక 4 గంటలకు.. అంటే ఈ నెల 23న రాత్రి 10.04 గంటలకు ల్యాండర్‌ తలుపులు తెరుచుకున్నాయి. రోవర్‌ నెమ్మదిగా బయటకు వచి్చంది. ప్రజ్ఞాన్‌ ప్రస్తుతం చందమామ ఉపరితలంపై తన ప్రయాణం నిరాటంకంగా సాగిస్తోంది. రోవర్‌ ప్రజ్ఞాన్‌ ల్యాండింగ్‌ సైట్‌ నుంచి ఇప్పటిదాకా 8 మీటర్లు ప్రయాణించినట్లు ఇస్రో ప్రకటించింది. అందులోని పేలోడ్స్‌ సైతం పని చేయడం మొదలైందని వెల్లడించింది. ప్రొపల్షన్‌ మాడ్యూల్, ల్యాండర్‌ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్స్‌ చక్కగా పని చేస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తలు