చంద్రుడిపై అడుగుపెట్టిన ప్రజ్ఞాన్‌ రోవర్.. ఇస్రో ఫొటోలు రిలీజ్‌

25 Aug, 2023 12:17 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయాణంలో తదుపరి దశ ఆవిష్కృతమైంది. విక్రమ్ ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్‌ రోవర్ విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపింది. ఈ దృశ్యాలను ఇస్రో తన ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది.   

బుధవారం నిర్ణీత సమయంలోనే చంద్రుడిపై విజయవంతంగా అడుగుపెట్టిన చంద్రయాన్-3 ప్రయోగం మలిదశకు చేరుకుంది. కోట్లాది భారతీయుల కలల్ని సాకారం చేస్తూ జాబిల్లిని ముద్డడాడిన చంద్రయాన్-3 ల్యాండర్ ఆరోజే చంద్రుడి ఉపరితలాన్ని ఫోటోలు తీయాగా వాటిని ఇస్రో సంస్థ సోషల్ మీడియాలో పొందుపరచింది. ఇక ఈ రోజు ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్‌ రోవర్ చంద్రుడిపై అడుగు పెట్టిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. "చంద్రయాన్-3 రోవర్ చంద్రుడి ఉపరితలంపై ఎలా అడుగుపెట్టిందో చూడండి.." అని రాసింది ఇస్రో సంస్థ.


ఇప్పటివరకు మూడు దేశాలు మాత్రమే చంద్రుడిపై అడుగు మోపగా నాలుగో దేశంగా భారత దేశం అక్కడికి చేరుకొని చరిత్ర సృష్టించింది. విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ లోని రెండు పరికరాలు, ల్యాండర్‌లోని మూడు పరికరాలు ILSA, RAMBHA,ChaSTE సక్రమంగానే పనిచేస్తున్నాయని అది చంద్రుడిపై  తిరుగుతూ పరిశోధనల ప్రారంభించిందని తెలిపారు ఇస్రో శాస్త్రవేత్తలు. రోవర్‌లో అమర్చిన రెండు పరికరాలు ప్రధానంగా చంద్రుని మట్టిలో మూలకాలు, రసాయనాలను నిశితంగా పరిశీలిస్తాయని తెలిపింది ఇస్రో.

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ తిరుగు ప్రయాణంలో మార్పులు..  

మరిన్ని వార్తలు