జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

17 Nov, 2023 13:28 IST|Sakshi

కశ్మీర్‌:  జమ్మూకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం ఎదురుకాల్పులు జరిగాయి. టెర్రరిస్టులు లష్కర్‌ ఎ తొయిబా ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. కుల్గాంలోని దమ్హాల్ హంజి పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే ముందస్తు సమాచారంతో బలగాలు రెక్కీ నిర్వహించాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిదాడికి దిగిన బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. గత అక్టోబర్‌లోనే కుల్గాం జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.   

ఇదీ చదవండి: యెమెన్‌లో కేరళ నర్సుకు నిరాశ.. మరణశిక్ష అప్పీల్‌ను తోసిపుచ్చిన కోర్టు

మరిన్ని వార్తలు