మరోసారి గవర్నర్‌ వద్దకు సీఎం గహ్లోత్‌

29 Jul, 2020 14:34 IST|Sakshi

జైపూర్‌: రాజాస్థాన్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాను కలిసేందుకు వెళ్తున్నానని సీఎం అశోక్‌ గహ్లోత్‌‌ చెప్పారు. అసెంబ్లీ సెషన్‌ను నిర్వహించేందుకు గవర్నర్‌ ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు వెళ్తున్నానని బుధవారం ఆయన మీడియాతో పేర్కొన్నారు. తమ ప్రభుత్వం బలపరీక్ష నిరూపించుకునేందుకు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్నాటు చేయాల‍న్న సీఎం గహ్లోత్‌ మూడో ప్రతిపాదనను కూడా గవర్నర్‌ తిరస్కరించిన విషయం తెలిసిందే. మెజారిటీని నిరూపించుకునే బలపరీక్షలో తమ ప్రభుత్వమే విజయం సాధిస్తుందని సీఎం అశోక్‌ గహ్లోత్‌ ఆశాభావం వ్యక్తం చేస్తూ.. ‘అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చే ముందు గవర్నర్  21 రోజులు లేదా 31 రోజుల నోటీసులు ఇచ్చినా మా ప్రభుత్వమే విజయం సాధిస్తుంది’ అని చెప్పారు. ఇప్పటికే‌ గవర్నర్‌  మూడు కారణాలను చూపుతూ సీఎం గెహ్లాట్‌ చేసిన రెండు ప్రతిపాదనలను రద్దు చేశారు.

(చదవండి: రాజ్‌భవన్‌లో ముగిసిన హైడ్రామా, వెనుదిరిగిన సీఎం)

అవి: అసెంబ్లీ సెషన్‌కు 21 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని, విశ్వసనీయ ఓటు విషయంలో విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని, కరోనా నేపథ్యంలో సభలో తగినంత భౌతిక దూరం పాటించే చర్యలు అనే మూడు కారణాలతో మిశ్రా సెంబ్లీ సమావేశాల నిర్వహణను వాయిదా వేసినట్టు తెలిపారు. కోవిడ్ మహమ్మారిని ఉటంకిస్తూ ఒక అసెంబ్లీ సమావేశాన్ని ప్రత్యేక ఆవశ్యకత లేకుండా పిలుపునివ్వలేమన్నారు. అంతేగాక 200 మంది ఎమ్మెల్యేలు సామాజిక దూరం పాటిస్తూ విశ్వాస పరీక్షలో పాల్గొనెందుకు అసెంబ్లీలో సీటింగ్‌‌ ప్రణాళిక లేదని గవర్నర్‌ స్పష్టం చేశారు. అదే విధంగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని గవర్నర్‌ మిశ్రా పేర్కొన్నారు. మార్చి 13న మొదటి సారి అసెంబ్లీ సమావేశాన్ని రద్దు చేసినప్పుడు కరోనా పాజిటివ్‌ కేసులు రెండు నమోదయ్యాయి. కరోనా దృష్ట్యా సమావేశం వాయిదా పడినట్లు గవర్నర్‌ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 10,000 దాటిందని ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది.

(చదవండి: ఎవరి బలమెంతో అక్కడే తేలుతుంది: గెహ్లోత్‌)

మరిన్ని వార్తలు