ముఖ్యమంత్రి దాతృత్వం.. ఓ పేద విద్యార్థి కలను సాకారం చేశారు

27 Nov, 2021 14:18 IST|Sakshi

విద్యార్థి ఇంజినీరింగ్‌ చదువుకు ఆర్థికసాయం 

భువనేశ్వర్‌: ఇంజినీరింగ్‌ చదువుకోవాలన్న ఓ పేద విద్యార్థి కలను ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సాకారం చేశారు. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలో 99.35 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, ఆర్థిక ఇబ్బందులతో కోర్సులో చేరేందుకు సతమతమవుతున్న బొలంగీరు జిల్లా, సింధెకెలా సమితి, బొడొపొడా గ్రామానికి చెందిన తారాచాన్‌ రాణాకి ముఖ్యమంత్రి ఆర్థికసాయం చేసి, దాతృత్వం ప్రదర్శించారు. వరంగల్‌ ఎన్‌ఐటీలో చేరి, ఇంజినీరింగ్‌ పూర్తి చేయాలన్నది ఆ విద్యార్థి లక్ష్యం.

అయితే తన కుటుంబానికి తనని చదివించే స్తోమత లేదు. ఈ నేపథ్యంలో సీఎం సాయం కోసం సదరు విద్యార్థి అభ్యర్థించాడు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సదరు విద్యార్థి అడ్మిషన్‌ ఫీజు కింద అయ్యే ఖర్చుని తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. తక్షణమే రూ.96,500 నగదుని విద్యార్థికి సీఎం అందజేసి, బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు.

చదవండి: 7 నెలలకే భర్త పరార్‌.. అత్తవారింటి మెట్లపైన కోడలి పూజలు

మరిన్ని వార్తలు