హథ్రాస్‌ ఘటనపై సీబీఐ విచారణ

3 Oct, 2020 21:05 IST|Sakshi

లక్నో: హథ్రాస్‌ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ శనివారం ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు యూపీ డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు బాధిత కుటుంబాన్ని కలిశారు. అనంతరం సీఎం యోగి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
(చదవండి : బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్‌)

ఇప్పటికే హాథ్రాస్‌‌ ఘటనపై దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) శుక్రవారం ముఖ్యమంత్రి యోగికి ప్రాథమిక నివేదికను సమర్పించింది. సిట్‌ సూచనల మేరకే ముఖ్యమంత్రి జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌లను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. వారందరికీ నార్కో ఎనాలిసిస్‌, పాలిగ్రాఫ్‌ పరీక్షలు చేయాలని ఆదేశించారు. దాంతో పాటు కొత్త ఎస్పీగా వినీత్‌ జైశ్వాల్‌ను నియమించారు.

మరిన్ని వార్తలు