కర్ణాటకలో ఖతర్నాక్‌ ఫైట్‌.. సీఎం అభ్యర్థులపై సస్పెన్స్‌

12 May, 2023 15:11 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు(శనివారం) విడుదల కానున్నాయి. ఇక, కర్ణాటకలో పార్టీల గెలుపుపై ఎగ్జిట్‌పోల్స్‌ ఆసక్తికర ఫలితాలను రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల ఫలితాల్లో ఏపార్టీకి మ్యాజిక్‌ ఫిగర్‌(113) వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేశాయి. దీంతో, హెచ్‌డీ కుమారస్వామి జేడీఎస్‌ పార్టీ కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుమారస్వామితో టచ్‌లో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మరోవైపు.. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం అభ్యర్థి ఎవరు అనే అంశంపై కూడా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా డీకే మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుంది. దాదాపు 150 స్థానాల్లో గెలుస్తాము. నేను నా అంచనాలకు మార్చుకోను. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి అవసరం లేదు. జేడీఎస్‌తో మేము ఎలాంటి చర్చ జరపలేదు. ఎన్నికల సందర్బంగా మా పార్టీకి చెందిన జాతీయ నేతలు, సిద్ధరామయ్య ఇతర నేతలు తీవ్రంగా కృషి చేశారు. మ్యాజిక్‌ ఫిగర్‌ దాటుతామన్న నమ్మకం నాకుంది. 

అయితే, కర్ణాటక సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎవరనే ప్రశ్నపై డీకే స్పందించారు. సీఎం ఎవరుతారనే అంశం కాంగ్రెస్‌ అధిష్టానం పరిధిలో ఉంది. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ నిర్ణయమే ఫైనల్‌ అంటూ కామెంట్స్‌ చేశారు. ఇక, కాంగ్రెస్‌ పార్టీ తరఫున సీఎం రేసులో సీనియర్‌ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ ఇద్దరూ ఉన్నారు.

ఇదిలా ఉండగా.. అటు బీజేపీలో కూడా సీఎం అభ్యర్థిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. బీజేపీ నుంచి సీఎం రేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మతో పాటుగా మాజీ సీఎం యడియూరప్ప కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సీఎం బొమ్మై నివాసంలో సీనియర్‌ నేతలు భేటీ అయ్యారు. బీఎల్‌ సంతోష్‌ ఆధ్వర్యంలో ఈ భేటీ జరుగుతోంది. 

ఇది కూడా చదవండి: మోదీ 'మన్‌ కీ బాత్' వినలేదని 36 మంది విద్యార్థులకు శిక్ష

మరిన్ని వార్తలు