కేటీఆర్ ‘స్వేద పత్రం​‍’ వాయిదా

23 Dec, 2023 11:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాలు శ్వేత పత్రం వర్సెస్‌ స్వేద పత్రంతో వేడెక్కాయి. శాసనసభ వేదికగా రెండు రోజుల పాటు కాంగ్రెస్‌ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రాలపై కౌంటర్‌గా బీఆర్‌ఎస్‌ తన వాదన వినిపించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు సిద్ధం అవ్వగా.. ఇవాళ్టి ఆ కార్యక్రమం వాయిదా పడింది.

శనివారం ఉదయం తెలంగాణ భవన్‌ వేదికగా కేటీఆర్‌ గత తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాగించిన ప్రగతి ప్రస్థానం పేరిట పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు సిద్ధమని ప్రకటించారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే.. 


చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు.. కార్యక్రమం వాయిదా పడింది. ఆదివారం ఆ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. అయితే వాయిదాకి గల కారణం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పాలన సువర్ణ అధ్యాయమని.. దానికోసం తమ ప్రభుత్వం చిందించిన చెమటను ప్రజలకు వరించేందుకే ‘స్వేద పత్రం’పేరిట పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నామని మాజీ మంత్రి కేటీఆర్‌ చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు