Alcohol Ban Exemption: గుజరాత్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎంపీ ఫైర్‌

23 Dec, 2023 16:46 IST|Sakshi

గాంధీనగర్‌: మద్యపాన నిషేధం నుంచి గిఫ్ట్ సిటీని మినహాయిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్ మండిపడ్డారు. గుజరాత్‌ ప్రభుత్వం.. గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌-సిటీ (గిఫ్ట్‌ సిటీ)లో హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో ‘వైన్‌ అండ్‌ డైన్‌’ సేవలకు అనుమతి ఇచ్చింది. అయితే మద్య నిషేధంలో గాంధీనగర్‌ జిల్లాలోని (గిఫ్ట్‌ సిటీ)లో మినహాయిచడాన్ని ఎంపీ శక్తిసిన్హ్ గోహిల్‌ తప్పుపట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గుజరాత్‌ మొత్తం వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపుతుందని  మండిపడ్డారు.

‘గాంధీనగర్‌ గిఫ్ట్‌ సిటీలో మద్య నిషేధం లేకపోతే.. ఇక్కడి ప్రజలు మద్యం సేవిస్తారు. ఇది గుజరాత్‌ రాష్ట్రంలో ఒక వ్యతిరేక ప్రభావం పడుతుంది’ అని శక్తిసిన్హ్ గోహిల్ మండిపడ్డారు. గిఫ్ట్‌ సిటీలో మద్య నిషేదం ఎత్తివేయడం వల్ల  ప్రభుత్వానికి ఎటువంటి లాభం చేకూరుతుందో తనకు అర్థం కావటం లేదని విమర్శించారు. గుజరాత్‌ ప్రభుత్వం గిఫ్ట్ సిటీలో ఉద్యోగులు, అధికారులు,  సందర్శకులకు మద్యం నిషేధం ఎత్తివేస్తున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా ప్రభుత్వ నోటిఫికేషన్‌ ప్రకారం.. హోటళ్లు, రెస్టారెంట్లలో  ప్రస్తుతం మందు బాటిళ్ల అమ్మకానికి అనుమతి లేదు.

చదవండి: ఈ ఏడాది భారత్‌కు వెరీ బిగ్‌ ఇయర్‌

>
మరిన్ని వార్తలు