రూ.80 వేల జీతం, అయినా సరిపోలే.. భార్యను నిత్యం అనుమానిస్తూ.. 

5 Jul, 2022 06:58 IST|Sakshi
భర్త మంజునాథ్‌తో తేజస్విని (ఫైల్‌)

బెంగళూరు: పుట్టించి నుంచి డబ్బు తేవాలని వేధిస్తూ భార్యను హత్య చేశాడో కిరాతక భర్త. హాసన్‌ తాలూకా దొడ్డమండిగనహళ్లికి చెందిన మంజునాథ్‌ బెంగళూరులో ఒక ఆటోమొబైల్‌ సంస్థలో పని చేస్తున్నాడు. ఇతనికి రూ.80 వేల జీతం వస్తుంది. కానీ క్రికెట్‌ బెట్టింగ్‌కు బానిసైన అతడు భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు. పుట్టింటికెళ్లి డబ్బు తేవాలని భార్య తేజస్వినిని వేధించేవాడు.

పెద్ద మనుషులు అనేకసార్లు రాజీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఇక బెంగళూరులో జీవించలేని మంజునాథ్‌ సంసారాన్ని హాసన్‌కు మార్చాడు. అక్కడ తేజస్విని చిన్న ఉద్యోగానికి వెళ్లేది. ఆమెను అనుమానిస్తూ వేధించేవాడు. చివరకు సోమవారం ఆమెను బండరాయితో కొట్టి చంపాడు. పోలీసులు మంజునాథ్‌తో పాటు అతని తల్లిదండ్రులు సరోజమ్మ, బసవేగౌడలను అరెస్ట్‌ చేశారు.   

చదవండి: (షట్టర్‌ పగలగొట్టి.. గ్యాస్‌ కట్టర్‌తో లాకర్‌ తెరిచి..)

మరిన్ని వార్తలు