ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ పొడిగింపు

9 May, 2021 13:21 IST|Sakshi

ఈ నెల 17 వరకు ఢిల్లీలో లాక్‌డౌన్‌

రేపటి నుంచి ఢిల్లీలో వారం పాటు మెట్రో సర్వీసులు రద్దు

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌ పొడిగించారు. ఈ నెల 17 వరకు మరో వారం పాటు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ వెల్లడించారు. రేపటి (సోమవారం) నుంచి ఢిల్లీలో వారం పాటు మెట్రో సర్వీసులు రద్దు చేసున్నట్లు ఆయన ప్రకటించారు. లాక్‌డౌన్‌ సత్ఫలితాలు ఇస్తోందని కేజ్రీవాల్ అన్నారు. పాజిటివ్ రేటు 35 నుంచి 23 శాతానికి తగ్గిందని సీఎం కేజ్రీవాల్‌ వెల్లడించారు.

దేశంలో కరోనా వైరస్‌ రెండో వేవ్‌ తీవ్రరూపంలో వ్యాపిస్తోంది. కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నా ఏమాత్రం ఫలితం ఉండడం లేదు. దీంతో విధిలేక చివరి అస్త్రంగా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధిస్తున్నాయి. కరోనా గొలుసు తెంపేందుకు లాక్‌డౌనే పరిష్కారమని రాష్ట్రాలు భావిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఏకంగా 14 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. మొదట మహారాష్ట్రతో మొదలైన లాక్‌డౌన్‌ అనంతరం ఢిల్లీ, కర్ణాటక విధించగా తాజాగా తమిళనాడు కూడా విధించింది. కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,03,738 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది.

చదవండి: దేశంలో పంజా విసురుతున్న మ్యూకోర్‌మైకోసిస్‌
కరోనా సంక్షోభంపై టాస్క్‌ఫోర్స్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు