అవి చైనా న్యుమోనియా కేసులు కావు: కేంద్రం

7 Dec, 2023 16:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎయిమ్స్‌ ఆస్పత్రిలో వెలుగు చూసిన న్యుమోనియా కేసులను చైనాలో వ్యాప్తిస్తున్న చిన్న పిల్లల న్యుమోనియా కేసులతో మూడిపేడుతూ ప్రచురించిన మీడియా కథనాలపై కేంద్రం సీరియస్‌ అయింది. ఆ కథనాలు తప్పుదోవ పట్టించే అసత్యాలని స్పష్టం చేసింది.

ఎయిమ్స్‌ వెలుగులోకి వచ్చిన కేసులు సాధారణమైన బ్యాక్టీరియల్‌ న్యుమోనియా కేసులని తెలిపింది. ఎయిమ్స్‌లో బయటపడ్డ న్యూమోనియా కేసులకు చైనాలోని కేసులకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది.

అదీ కాగా ప్రస్తుతం వెలుగు చూసిన న్యుమోనియా కేసులు ఎయిమ్స్‌లో గత ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు నిర్వహించిన అధ్యయనంలో భాగమని తెలిపింది. ఈ కేసులను చైనా కేసులుగా భావించి.. ఎవరు భయాందోళనకు గురి​కావొద్దని స్పష్టం చేసింది. న్యుమోనియాపై మీడియాలో ప్రచురించే నివేదికలు అసత్యమని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు