ఢిల్లీలో హై అలర్ట్‌.. మెట్రో స్టేషన్‌ గోడలపై ఖలిస్థాన్ నినాదాల కలకలం

27 Aug, 2023 14:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని శివాజీ పార్కు నుండి పంజాబ్ బాగ్ మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థాన్ తీవ్రవాదుల నినాదాలు కలకలం సృష్టించాయి. ఈ మేరకు SFJ సంస్థలోకి వీడియోను కూడా విడుదల చేసింది. మెట్రో అధికారుల నుండి సమాచారాన్ని అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు అన్ని మెట్రో స్టేషన్ల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. 

ఢిల్లీని ఖలిస్థాన్ గా మారుస్తామని, పంజాబ్ భారత దేశానికి చెందినది కాదని, మోదీ భారతదేశం సిక్కుల నరమేధానికి పాల్పడిందని, ఖలిస్థాన్ రెఫరెండం జిందాబాద్ అని SFJ పేరుతో ఈ  నినాదాలను రాశారు దుండగులు. 

భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన జీ20 సదస్సుకు కొద్దిరోజుల ముందు  ఖలిస్తానీలు ఈ దారుణానికి ఒడిగట్టడంతో ఢిల్లీ పోలీసులు భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసి 450కి పైగా క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను  పీసీఆర్ వ్యాన్‌లు, 50కి పైగా అంబులెన్స్‌లు, ఎయిర్‌పోర్టు, ప్రగతి మైదాన్, రాజ్‌ఘాట్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో అగ్నిమాపక యంత్రాలతో సహా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దుండగుల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు.

ఇది కూడా చదవండి: మోదీ మన్‌కీ బాత్‌.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని

మరిన్ని వార్తలు