ఆక్సిజన్‌ మృతులపై అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం

28 May, 2021 12:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ అందక మృతి చెందిన కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల నష్ట పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రకటించారు. ఈమేరకు నష్ట పరిహారానికి సంబంధించిన అంశంపై ఆరుగురు వైద్యులతో ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసింది. పరిహారం విషయంలో కమిటీ నివేదిక మేరకు ప్రభుత్వం బాధితులకు సహాయం అందించనుంది.

ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కమిటీ వారం చొప్పున వైద్య ఆరోగ్య కార్యదర్శికి నివేదిక అందిస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈనెల ఆరంభంలో ఢిల్లీలోని బత్రా ఆస్పత్రిలో 12 మంది ఆక్సిజన్‌ అందక మృతి చెందిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 24వ తేదీన ఢిల్లీలోని జైపూర్‌ గోల్డెన్‌ ఆస్పత్రిలో 20 మంది కరోనా బాధితులు కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. మృతుల విషయమై ప్రభుత్వం ఫిర్యాదులు, దరఖాస్తులు నేరుగా లేదా, ఆన్‌లైన్‌లో స్వీకరిస్తుంది. వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు