‘ఇండియా’లో లోక్‌సభ ఎన్నికల నాటికి ఐక్యత అవసరం

29 Oct, 2023 05:31 IST|Sakshi

ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌

ముంబై: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కొన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థులను బరిలో నిలపడలంలో సభ పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ)చీఫ్‌ శరద్‌ పవార్‌ చెప్పారు. అయితే, 2024లో లోక్‌సభ ఎన్నికల వేళకు ఇవన్నీ సర్దుకుని, ఉమ్మడిగా పోటీ చేసేందుకు అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ప్రతిపక్షపార్టీలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. జాతీయ స్థాయిలో కూడా ఇదే విధమైన మార్పు వస్తుందని చెప్పేందుకు తన వద్ద కచ్చితమైన సమాచారం లేదన్నారు.  మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు లేవని ఆయన గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో బలంగా కాంగ్రెస్‌ ఉండగా, మరికొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు కీలకంగా ఉన్నాయన్నారు. ఇలాంటి సందర్భాల్లో తలెత్తే విభేదాలను పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు.

మరిన్ని వార్తలు