సీఎం ‘శ్రీహరి’ పిలుపు: హిందీలో మందుల చీటి ఫోటోలు వైరల్‌

18 Oct, 2022 10:09 IST|Sakshi

సాత్నా:  మందుల చీటిపై (ప్రిస్క్రిప్షన్‌) ‘శ్రీహరి’ అంటూ మొదలుపెట్టాలని, ఔషధాల పేర్లను హిందీ భాషలో రాయాలని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపునకు డాక్టర్లు స్పందిస్తున్నట్లే కనిపిస్తోంది. సాత్నా జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యుడు మందుల చీటిపై శ్రీహరి అని రాయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ చీటి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కొటార్‌ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ)లో పనిచేస్తున్న సర్వేష్‌ సింగ్‌ అనే డాక్టర్‌ ఈ ప్రిస్క్రిప్షన్‌ రాశారు. సాధారణంగా ‘ఆర్‌ఎక్స్‌’ అనే లాటిన్‌ పదాన్నిమందుల చీటిపై మనం చూస్తుంటాం. ఆర్‌ఎక్స్‌ అంటే ‘ఔషధం తీసుకోండి’ అని అర్థం.

సర్వేష్‌ సింగ్‌ 2017లో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. ప్రభుత్వ వైద్యుడిగా ఉద్యోగం సాధించారు.  లౌలాచ్‌కు చెందిన రోగి రష్మీ సింగ్‌ కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా.. చికిత్స అందించిన వైద్యుడు.. హిందీలో చీటీ రాసి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. మందుల చీటిలో ‘ఆర్‌ఎక్స్‌’కు బదులుగా ‘శ్రీ హరి’ అని రాస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రిస్క్రిప్షన్‌పై ‘శ్రీహరి’ మధ్యప్రదేశ్‌ సీఎం వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు