Dog Train Journey: వైరల్‌: నక్క తోక తొక్కిన కుక్క ! వీఐపీలా..

15 Oct, 2021 12:01 IST|Sakshi

సాధారణంగా ఇంట్లో పెంపుడు జంతువులంటే ముఖ్యంగా కుక్కనే ఎక్కువ మంది పెంచుకుంటారు. ఆ జాబితాలో కొందరు వాటిని జంతువుల్లా కాకుండా తమ సొంత మనుషుల్లా ట్రీట్‌ చేస్తుంటారు. కొందరు వీటిని అల్లారు ముద్దుగా కూడా పెంచుకునే వాళ్లు ఉన్నారు. ఇటీవల త‌న పెంపుడు కుక్క కోసం ఓ మహిళ ఏకంగా విమానంలోని బిజినెస్ క్లాస్ మొత్తం బుక్ చేసిన‌ సంగతి తెలిసిందే.  (చదవండి: Funny Video: ఏయ్‌ నిన్నే.. పిలుస్తుంటే పట్టించుకోవా.. పంతం నెగ్గించుకున్న పిల్ల ఏనుగు )

తాజాగా ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క కోసం రైలులోని బిజినెస్‌ క్లాస్‌ మొత్తం బుక్‌ చేశాడు.  అంతేనా ఆ పెట్‌ డాగ్‌ రైలు జర్నీపై ఓ వీడియోని చిత్రీకరించి త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. ఒక ప్రయాణీకుడు లాబ్రడార్‌లు, బాక్సర్‌లు వంటి చిన్న లేదా పెద్ద కుక్కలను తీసుకెళ్లడానికి అనుమతి ఉంది.

కానీ పెంపుడు జంతువులు మాత్రం ఏసీ ఫస్ట్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్‌లో మాత్రమే ప్రయాణించడానికి వీలుంది. మరొక నిబంధన ఏమిటంటే తమ పెంపుడు జంతువుల కోసం సదరు వ్యక్తి రైలులోని మొత్తం కంపార్ట్మెంట్ రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న కుక్క పిల్ల‌లు అయితే వాటి కోసం కొన్ని కంపార్ట్‌మెంట్ల‌లో బాక్స్‌లు ఉంటాయి. వాటికి ఆహారం యజమానులే తెచ్చుకోవాల్సి ఉంటుంది.

A post shared by Rio (@alabnamed_rio)

చదవండి: చాట్‌ అమ్ముతూ కేజ్రీవాల్‌ !.. తీరా చూస్తే అసలు కథ వేరే..

మరిన్ని వార్తలు