ఆ విరాళాల వివరాలు మాకివ్వండి: ఈసీ

14 Nov, 2023 05:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా అందిన విరాళాల వివరాలను నవంబర్‌ 15 సాయంత్రంలోగా అందించాలని పారీ్టలను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది. సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు అందిన విరాళాల వివరాలను సీల్డ్‌ కవర్‌లో నివేదించాలని ఈసీని సర్వోన్నత న్యాయస్థానం ఈనెల రెండో తేదీన ఆదేశించిన నేపథ్యంలో ఈసీ పై విధంగా స్పందించింది.

‘‘ ఒక్కో ఎలక్టోరల్‌ బాండ్‌ విలువ ఎంత? ఆ బాండ్‌ విలువలో ఎంత మొత్తాన్ని మీ బ్యాంక్‌ ఖాతాలో జమ చేశారు? మొత్తం ఎన్ని బాండ్లు మీకు వచ్చాయి? మొత్తం బాండ్ల ద్వారా స్వీకరించిన విరాళాలు..’ ఇలా ప్రతీదీ సవివరంగా పేర్కొంటూ జాబితాను డబుల్‌ సీల్డ్‌ కవర్‌లో సమరి్పంచండి’’ అంటూ ఆయా పారీ్టల చీఫ్‌లకు ఈసీ లేఖలు పంపింది.

మరిన్ని వార్తలు