సోరెన్‌పై ఈడీ ప్రశ్నల వర్షం

21 Jan, 2024 04:30 IST|Sakshi

ఏడు గంటలకుపైగా విచారణ

రాంచీ: జార్ఖండ్‌లో భూకుంభకోణం, సంబంధిత మనీ లాండరింగ్‌ కేసులో ఆఫీసుకొచ్చి విచారణకు హాజరుకావాలని ఏడు సార్లు సమన్లు ఇచ్చినా బేఖాతరు చేసిన జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు చివరకు ఆయన ఇంటికే వచ్చి విచారించారు. ఈడీ అధికారులు వస్తున్నారన్న వార్తతో జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యకర్తలు రావడంతో ఈడీ అధికారుల రక్షణ కోసం భద్రతాబలగాలు భారీ ఎత్తున మొహరించారు.

దీంతో ఇంటి పరిసరాలు ఖాకీవనాన్ని తలపించాయి. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాంచీలోని ఆయన నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు సోరెన్‌పై సుదీర్ఘంగా ఏడు గంటలకుపైగా ప్రశ్నలు సంధించారు. కేసుపై పలు వివరాలు అడిగారు. ఈ సందర్భంలో రాష్ట్ర మంత్రి జోబా మాంఝీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్, రాజ్యసభ ఎంపీ మహువా మాజీ, కొందరు పార్టీ ఎమ్మెల్యేలు ఇంట్లోనే ఉన్నారు.

రాష్ట్ర డీజీపీ అజయ్‌సింగ్‌ సైతం అక్కడే ఉన్నారు. జేఎంఎం గిరిజన కార్యకర్తలు కొందరు విల్లు, బాణాలతో సోరెన్‌ ఇంటిపరిసరాల్లో గుమిగూడి ఈడీ వ్యతిరేక నినాదాలిచ్చారు. ఈడీ వ్యతిరేక ర్యాలీలు జరక్కుండా రాంచీ సబ్‌ డివిజనల్‌ మేజి్రస్టేట్‌ ఉత్కర్‌‡్ష ఇంటి పరిసరాల్లో కర్ఫ్యూ విధించారు. ఈడీ చర్యపై జేఎంఎం కార్యకర్తలు, గిరిజన సంఘాల నేతలు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు దిగారు.  

ఇప్పటికే 14 అరెస్ట్‌లు
భూ హక్కులను మాఫియా అక్రమంగా చేతులు మార్చి కోట్లు కొల్లగొట్టారని ఈడీ గతంలో ఆరోపించింది. ఇప్పటికే ఈ కేసులో 2011 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఛావీ రంజన్‌ సహా 14 మందిని ఈడీ అరెస్ట్‌చేసింది. ఈ కేసులో బాధితుడిగా నాటకం ఆడుతూ సీఎం రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేయిస్తున్నాడని బీజేపీ ఆరోపిస్తోంది. సీఎంను కేసులోకి లాగి ప్రభుత్వాన్ని కూలదోయాలని మోదీ సర్కార్‌ కుట్ర పన్నిందని జేఎంఎం ఆరోపిస్తోంది.

నా పై కుట్ర: సోరెన్‌
ఏడు గంటలపాటు ఈడీ విచారణ ముగిశాక ఇంటిబయట కార్యకర్తలనుద్దేశించి సోరెన్‌ మాట్లాడారు. ‘‘ నా పై కుట్ర పన్నారు. కుట్రను త్వరలోనే బయటపెడతా. మనం ఎవరికీ భయపడేది లేదు. మీ విశ్వాసాన్ని సమున్నతంగా నిలిపేందుకు బుల్లెట్లనైనా ఎదుర్కొంటా. నాకు మద్దతుగా ఇక్కడికొచి్చన మీకందరికీ ధన్యవాదాలు’’ అని సోరెన్‌ ప్రసంగించారు.

>
మరిన్ని వార్తలు