లేడీ కానిస్టేబుల్‌ సాహసం.. చిరుతలా ప‌రుగెత్తి బాధితురాలిని..

22 Nov, 2021 21:06 IST|Sakshi

ముంబై: మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని బైకులా రైల్వేస్టేష‌న్‌లో లోకల్‌ రైలు ఎక్కే ప్ర‌య‌త్నంలో ఓ నలబై ఏళ్ల మ‌హిళ అదుపుతప్పి డోర్‌లో ప‌డిపోయింది. దీంతో రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మ‌ధ్య ఉన్న‌ సందులోకి ఆమె జారిపోతున్న సమయంలో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్‌ మ‌హిళా కానిస్టేబుల్ గోల్క‌ర్‌ గ‌మ‌నించి వెంటనే స్పందించింది.

చిరుతలా ప‌రుగెత్తి బాధితురాలిని ప్లాట్‌ఫామ్‌పైకి లాగేసింది. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. కాగా, గ‌త రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో స‌ద‌రు మ‌హిళా కానిస్టేబుల్ ఇలాంటి సాహ‌సం చేయటం ఇది రెండోసారని అధికారులు పేర్కొన్నారు. రెండు నెల‌ల క్రితం కూడా ఓ మ‌హిళా ఇలాగే రైలు ఎక్క‌బోయి ప‌డిపోతుండ‌గా  ఆమె చాక‌చ‌క్యంగా స్పందించి ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే.

కాగా, ఆర్పీఎఫ్‌ మ‌హిళా కానిస్టేబుల్ చూపిన ధైర్యానికి ఉన్న‌తాధికారులు అభినంద‌న‌ల‌తో ముంచెత్తుతున్నారు. మహిళా కానిస్టేబుల్‌ గోల్క‌ర్ సదరు మ‌హిళ‌ను కాపాడిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతోంది. కానిస్టేబుల్‌ తెగువపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

మరిన్ని వార్తలు