దంపతుల పోట్లాట దెబ్బకు.. దారి మళ్లిన విమానం! 

30 Nov, 2023 09:18 IST|Sakshi

న్యూఢిల్లీ: భార్యాభర్తల గొడవలంటే ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అయితే ఆ గొడవ దెబ్బకు బుధవారం ఏకంగా ఓ అంతర్జాతీయ విమానాన్నే దారి మళ్లించాల్సి వచ్చింది! మ్యూనిచ్‌ నుంచి బ్యాంకాక్‌ వెళ్తున్న జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ విమానం ఈ ఘటనకు వేదికైంది.

విమానం మ్యూనిచ్‌ నుంచి బయల్దేరిన కాసేపటికే అందులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు గొడవ పడ్డారు. భర్తది జర్మనీ కాగా భార్యది థాయ్‌లాండ్‌. భార్య ఫిర్యాదుతో విమానాన్ని పైలట్‌ ఢిల్లీ మళ్లించి భర్తను పోలీసులకు అప్పగించారు. అయితే, క్షమాపణలు చెప్పడంతో అతన్ని మరో విమానంలో బ్యాంకాక్‌ పంపడం కొసమెరుపు!
ఇదీ చదవండి: నిజంగా ఇది వింతే మరి.. పెద్దాయన పెద్ద పేగులో ఈగ..

మరిన్ని వార్తలు