TS Elections: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన.. కవితపై ఈసీకి ఫిర్యాదు

30 Nov, 2023 08:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ సీఈవో, సీని ప్రముఖులు, రాజకీయ నాయకులు ఓటు వేశారు. 

మరోవైపు.. ఓటు వేసిన క్రమంలో కొందరు నేతలు తమ పార్టీలకే ఓటు వేయాలని కోరడం వివాదాస్పదంగా మారింది. ఆమె బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరడం ఎన్నికల్‌ కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్‌ నేతల ఆరోపిస్తున్నారు. దీంతో, కవితపై కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కవిత మాట్లాడిన వీడియోను సీఈవో వికాస్‌రాజ్‌కు దృష్టికి తీసుకెవెళ్తామని చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ కోరారు. 

జనగామ.. 
జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ పాఠశాల వద్ద స్వల్ప ఉద్రిక్తత..
పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పర్యవేక్షించిన బీఆర్ఎస్ అభ్యర్థి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి. 
పోలింగ్ స్టేషన్ వద్ద ఎక్కువసేపు ఉన్నాడని అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ నాయకులు, సీపీఎం నాయకులు.
దీంతో, ఇరువర్గాల మద్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. 
రంగంలోకి దిగిన ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు..
పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొన్న ఏసీపీ దేవేందర్ రెడ్డి..

కల్లూరులో తోపులాట..
ఖమ్మంలోని కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో పొలింగ్ బూత్ వద్ద బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య తోపులాట
పోలింగ్ బూతు వద్ద బీఆరెఎస్‌ నాయకులు పార్టీ కండువాలు కప్పుకొని ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఇరువర్గాల వారిని చెదరగొట్టిన పోలీస్ బలగాలు

ఖమ్మం..
సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామంలో ఓటు వేయకుండా పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు
తమ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఓటును బహిష్కరించిన గిరిజన గ్రామస్తులు.

ఆదిలాబాద్‌..
నిర్మల్‌లో ఓటు వేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.
పోలింగ్‌ కేంద్రంలోకి బీఆర్‌ఎస్‌ కండువా వేసుకుని వెళ్లిన ఇంద్రకరణ్‌రెడ్డి. ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందన్న కాంగ్రెస్‌ నేతలు. 

ఎస్‌ఆర్‌నగర్‌
ఎస్‌ఆర్‌ నగర్‌లో సీఈవో వికాస్‌రాజ్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం ఏడు గంటలకే తెలంగాణలో పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రశాంతంగా ఓటింగ్‌ కొనసాగుతోంది. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. రాజకీయ నాయకులు తొందర పడి వ్యాఖ్యలు చేయవద్దు. నేతలు ఎవరూ నిబంధనలు అతిక్రమించవద్దు. ఈవీఎం సమస్య తలెత్తిన చోట సరిచేస్తున్నాం. యువత ఓటు వేయడానికి ముందుకు రావాలి. పోలింగ్‌ బూత్‌ను యాప్‌ లోకేషన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఈసారి ఓటింగ్‌ శాతం పెరుగుతుంది. 

మీ ఓటు మీ అతిపెద్ద బాధ్యత..
‘‘మీ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, మీ ప్రియమైన వారు తమ జీవితాలను త్యాగం చేసిన మాతృభూమి కోసం ఆలోచించి ఓటు వేయండి. నిజమైన ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మీకు చూపించగల వారికి అవకాశం ఇవ్వండి.’’ - ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి

 
ప్రతి ఓటూ కీలకం..

‘‘మీ ఓటు వచ్చే ఐదేళ్ల గతిని నిర్ణయిస్తుంది. సుసంపన్నమైన తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఓటూ కీలకం. అర్హులైన ఓటర్లందరూ, ప్రత్యేకించి మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి. మీ కుటుంబం, స్నేహితులు కూడా ఓటు వేసేలా ప్రోత్సహించండి’’ - జి.కిషన్‌ రెడ్డి, భాజపా తెలంగాణ శాఖ అధ్యక్షుడు


పెద్ద ఎత్తున తరలిరావాలి..

‘‘అవినీతి రహిత, పేదల పక్షపాత ప్రభుత్వం మాత్రమే తెలంగాణ శ్రేయస్సు కోసం నిస్వార్థంగా పని చేస్తుంది. ప్రజల సాధికారతే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున తరలిరావాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.’’ - కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా


తెలంగాణలో పోలింగ్‌.. మోదీ ట్వీట్‌..

‘‘తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని పిలుపునిస్తున్నాను. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నాను’’ - ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు