FlipKart Apology: కస్టమర‍్లకు క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్‌.. ఎందుకో తెలుసా..?

9 Mar, 2022 15:24 IST|Sakshi

ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ ప్లిప్‌కార్ట్‌.. చిన్న తప్పిదం కారణంగా తమ కస్టమర్లకు సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప‍్లిప్‌కార్ట్‌ కిచెన్‌ అప్లెయెన్స్‌ను ప్రమోట్‌ చేసుకుంది. మార్చి 8వ తేదీన(అంతర్జాతీయ మహిళా దినోత్సవం) రూ.299 నుంచి కిచెన్ అప్లెయెన్స్‌ను పొందవచ్చునని ప్లిప్‌కార్ట్‌ తెలిపింది. అయితే, ఈ ఆఫర్‌ను బేస్‌ చేసుకొని కొంత మంది మహిళలు ప్లిప్‌ కార్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా దినోత‍్సవం రోజున వంట గదికి సంబంధించిన ఆఫర్‌ను మాత్రమే ఎందుకు ప్రకటించారు. వంట గది మాత్రమే మా ప్రపంచం కాదంటూ ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలోనే మీ ఆఫర్‌కు నో థ్యాంక్స్‌ అంటూ కామెంట్‌ చేశారు. దీంతో నెటిజన్లు సోషల్‌ మీడియాలో ప్లిప్‌కార్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్‌ చేశారు.

ఈ నేపథ్యంలో తమ తప్పును తెలుసుకున్న ప్లిప్‌ కార్ట్‌.. ట్విట‍్టర్‌ వేదికగా క్షమాపణలు చెప్పింది. తాము ఎవరి మనోభావాలను కించపరచాలని అనుకోవడంలేదని, ఆందోళన చెందుతున్నామని తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కిచెన్ సామాగ్రిని ప్రమోట్ చేస్తూ వార్త ప్రచురించిన ఈ-కామర్స్ సైట్ మార్కెటింగ్ విభాగం తప్పు చేసిందని ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లను క్షమాపణలు కోరింది. 

మరోవైపు.. ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ ప్లిప్‌కార్ట్‌ హోలీ పండుగ సందర్బంగా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. మార్చి 12-16వ తేదీ వరకు బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్స్‌ను ప్రారంభించనుంది. హోలీ పండుగ సేల్స్‌లో భాగంగా పలు ప్రొడక్ట్‌లపై 80 శాతం డిస్కౌంట్‌, యాపిల్‌, శాంసంగ్‌, రియల్‌ మీ, ఒప్పో వంటి స్మార్ట్‌ ఫోన్లపై 60 శాతం వరకు భారీ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. 

మరిన్ని వార్తలు