వీడెవండి బాబు.. వారానికి 4 రోజుల పని.. రూ.50 వేల జీతం.. ఇవి సరిపోతాయా సార్‌!

23 Jul, 2023 18:41 IST|Sakshi

ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం సాధించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. కాలేజ్‌లో ఎంత బాగా చదివిన ఎన్ని మార్కులు వచ్చినా .. జాబ్‌కు దగ్గరకు వచ్చే సరికి అవన్నీ ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లడం వరకు మాత్రమే పని చేస్తాయి. అక్కడి నుంచి ఉద్యోగం తెచ్చుకోవడం మన స్కిల్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఇక అంత కష్టపడి జాబ్‌ వచ్చాక మనకు నచ్చినట్లు ఉండాలంటే కదరదు. రోజూ 8 గంటల పని.. ఇక ఆఫీసులో క్షణం తీరిక లేకుండా సంస్థను మెప్పించాల్సి ఉంటుంది.

 ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగి దినచర్య అంటే ఇలానే ఉంటుంది. అయితే ఇటీవల ఓ ఫ్రెషర్‌ను ఇంటర్వ్యూ చేయగా.. అతని డిమాండ్లు చూసి ఇంటర్వ్యూర్‌ షాక్‌ అయ్యాడు. ఈ విషయాన్నే సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.  కోల్‌కతాలోని ఒక న్యాయవాది ఇటీవల లిటిగేషన్ అసోసియేట్ పోస్ట్ కోసం ఒక ఫ్రెషర్‌ను ఇంటర్వ్యూ చేశాడు. అయితే ఇంటర్య్వూకి వచ్చిన ఆ అభ్యర్థి తనుకు ఉన్న డిమాండ్లతో పాటు రూ. 50,000 జీతం కావాలని చెప్పడట. దీంతో ఆయన ఆశ్చర్యపోయారు.

ఈ విషయాన్ని ట్వీట్‌ చేస్తూ.. 'లిటిగేషన్ అసోసియేట్ పోస్ట్ కోసం ఓ ఫ్రెషర్‌ను ఇంటర్వ్యూ చేశాను. అతను పని చేయాలంటే.. తనకి వారంలో 4 రోజులు, రోజుకు 4 గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పాడు. అలాగే కోర్టుకు వెళ్లడం కూడా తనకి ఇష్టం లేదని, అందుకే ఆఫీసులో ఉండి చేసే ఉద్యోగం కావాలని చెప్పాడు. కోల్‌కతలో ఉద్యోగం కాబట్టి జీతం రూ.50 వేలు ఇవ్వాలన్నాడు. ఈ తరానికి నా ఆశిస్సులు.' అని అన్నారు.

కోల్‌కతాలో జీవన వ్యయం చాలా తక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ కంపెనీ మెర్సెర్ ప్రపంచ వ్యాప్తంగా 227 నగరాలపై కాస్ట్ ఆఫ్ లివింగ్ 2023 సర్వే నిర్వహించగా అందులో కోల్‌కతా 211వ స్థానంలో నిలించింది. అంటే చాలా తక్కువ ఉంటుందని దాని అర్థం. ముంబై, ఢిల్లీ వంటి నగరాలు భారతీయ నగరాల్లో అగ్ర స్థానాల్లో ఉన్నాయి. కోల్‌కతా వంటి నగరాలలో ఉండి కూడా.. ఒక ఫ్రెషర్ అయ్యిండి అంత ఎక్కువ శాలరీతో పాటు ఇన్ని డిమాండ్ చేయడంపై నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఇలా అయితే ఎక్కడ ఉద్యోగం రాదని కామెంట్‌ చేయగా.. మరికొందరు  ఈ డిమాండ్లు సరిపోతాయా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
 

చదవండి   రోడ్డుకు అడ్డంగా పడుకుని పోలీసు వినూత్న నిరసన.. ఏం జరిగిందంటే?

మరిన్ని వార్తలు