ఏపీ, తెలంగాణల్లో నాలుగు గుర్తులకు నో 

25 Sep, 2021 15:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తులను సవరిస్తూ శుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఎన్నికల సంఘం జాతీయ, రాష్ట్ర పార్టీలకు శాశ్వత గుర్తులు కేటాయించింది. ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీల కోసం కేటాయించే ఫ్రీ సింబల్స్‌ విషయంలో కొన్ని ఆంక్షలను విధించింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లో పలు గుర్తులను ఉపయోగించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటూ తాజా ఉత్తర్వులు జారీచేసింది.

అందులో భాగంగా ఆటోరిక్షా, టోపీ, ఇస్త్రీపెట్టె, ట్రక్కు గుర్తులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో వినియోగించుకోకుండా ఆంక్షలు విధించింది. ఈ గుర్తులను ఏపీ, తెలంగాణ మినహా దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. కాగా, గతంలో జనసేనకు కేటాయించిన గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్‌ కేటగిరీలో ఉంచింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు