కష్టాలకు లొంగని మహిళా ట్యాక్సీ డ్రైవర్.. విదేశాల్లో చదువుకునే స్థాయికి..

30 Jul, 2023 21:20 IST|Sakshi

ముంబయి: కష్టాలకు లొంగని తత్వం తనది. ఎక్కడో మారుమూల గిరిజన గూడెంలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తోంది. పరిస్థితులు పరీక్షించినా.. కుటుంబ భారం మీద పడినా.. అమ్మాయి డ్రైవారా..! అంటూ సమాజం చిన్నచూపు చూసినా బెరుకులేని జీవిత ప్రయాణం సాగించింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సహాయంతో చివరికి విదేశాల్లో చదువుకోవాలనే తన కలను సాకారం చేసుకుంది. 

ఆ యువతి పేరు కిరణ్ కుర్మా. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాలోని రేగుంత గ్రామానికి చెందినది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి ఆరోగ్యం దెబ్బతినడంతో కుటుంబ పోషణకు ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేయాల్సి వచ్చింది. రేగుంత నుంచి సిరోంచ వరకు 140 కిలోమీటర్ల దూరం ట్యాక్సీ నడిపింది. ప్రస్తుతం ఆమెకు మూడు ట్యాక్సీ లు ఉన్నాయి. 

మావోయిస్టు ప్రాంతంలో సాహసంతో ట్యాక్సీ సేవలు అందించినందుకు వరల్డ్ క్రాస్ అనే సంస్థ ఆమెను గుర్తించింది. ఇప్పటికీ ఆమెకు 18 అవార్డులు కూడా వచ్చాయి. అయితే.. తన ఉన్నత చదువుల కోసం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను సంప్రదించింది. దీంతో ఆయన రూ.40 లక్షల స్కాలర్‌షిప్‌ను మంజూరు చేశారు. యూకేలో ఏడాది పాటు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ కోర్సును యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్స్ లో ఆమె చదవనున్నారు. మరో రెండేళ్ల పాటు అక్కడే ఓ సంస్థలో పనిచేయనున్నారు. 

ఇదీ చదవండి: IIT Bombay: ఐఐటీ బాంబేలో కొత్త వివాదం.. నాన్‌ వెజిటేరియన్లు వేరే చోట కూర్చోవాలంటూ..

మరిన్ని వార్తలు