Guillain Barre Syndrome; "అనుకోని అరుదైన వ్యాధి జీవితాన్నే మార్చేసింది"

8 Oct, 2021 20:14 IST|Sakshi

గుయిలిన్ బారే సిండ్రోమ్‌ అనే అత్యంత అరుదైన వ్యాధి

రాజస్తాన్‌: మనం కాస్త బాగొకపోతేనే డీలా పడిపోతాం. కొంచెం వంట్లో బాగోకపోతే ఇక రెస్ట్‌ తీసుకుంటాం. కానీ రాజస్తాన్‌కి చెందిన ఒక అమ్మాయి లక్షల్లో ఒక్కరికీ వచ్చే అరుదైన వ్యాధితో పోరాడుతూ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడానికీ శతవిధాల ప్రయత్నిస్తోంది.

వివరాల్లోకెళ్లితే..... రాజస్తాన్‌కి చెందిన హర్షిత దరియాని 11 ఏళ్ల ప్రాయంలో తల్లిని కోల్పయింది.  అంత చిన్నవయసులో ఆ దుఃఖాన్ని అధిగమించి అందరిలా నవ్వుతూ, ఆడుతూ...హయిగా చదువుకునేది. సాఫీగా సాగిపోతుంది అని అనుకుంటుండగా అనుకోని అరుదైన గుయిలిన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్‌ ) వ్యాధి ఆమెను మళ్లీ అగాధంలోకి తీసుకువెళ్లిపోయింది.

హర్షిత ఇంటర్మీడియేట్‌లో ఉండగా ఒక రోజు బ్యాడ్మింటన్‌ ఆడుతుంటే ఎడమ చేయి విపరీతమైన నొప్పి వచ్చి ఇక ఆడలేక హాస్టల్‌కి వచ్చేసింది. ఆ తర్వా త రోజు స్టడీ అవర్స్‌ కోసమై వార్డెన్‌ మేడం తెల్లవారుఝూమున లేపితే ఆమె అసలు బెడ్‌మీద నుంచి ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో జాయిన్‌ చేశారు. అప్పుడే తెలిసింది అత్యంత అరుదుగా నూటికి ఒక్కరికో ఇద్దరికో వచ్చే గుయిలిన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్‌ ) బాధపడుతున్నట్లు డాక్టర్లు చెప్పారు.

అప్పటికే ఆమె ఆ వ్యాధి నరాల వ్యవస్థపై దాడి చేసి శరీరం మొతం పక్షవాతం వచ్చినట్లుగా చలనం లేకుండా చేసేసింది. ఆఖరికి ఊపిరితిత్తులు కూడా పనిచేయడం మానేశాయి. దీంతో శ్వాస తీసుకోవడమే కష్టమైంది, ఆమె ఐసీయూలో 47 రోజులు కోమాలోనే ఉంది. అయినప్పటికీ విద్యాసంవత్సరాన్ని క్పోల్పోకుండా పరీక్షకి వీల్‌ చైర్‌లో వెళ్లి మరీ రాసి మంచి మార్కులతో ఇంటర్మీడియేట్‌ పాసై అయ్యింది. కానీ ఈ వ్యాధి కారణంగా తనకి ఇష్టమైన మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేయాలన్న ఆశను వదులుకోవల్సి వచ్చింది.

ప్రస్తుతం తాను బిజినెస్‌ స్కూల్‌లో జాయిన్‌ అవ్వుతున్నానని, అమెజాన్‌తో కలిసి పనిచేయడానికీ ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఈ మేరకు హర్షిత మాట్లాడుతూ..."సరిగ్గా ఐద్దేళ్ల క్రితం తాను కనీసం కళ్ల రెప్పలను కూడా కదిలించ లేకపోయాను చూపుతోటే చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడూ వాటన్నింటిని అధిగమించగలిగాన. జీబీఎస్‌ వ్యాధి నా జీవితాన్ని మార్చేసింది. దేన్నైన తట్టుకుని బతకలగలనన్న ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చింది. ఈ కష్టం నన్ను కదలనియదు అనుకున్నాను కానీ కాలంతో పాటు అది మారిపోతుంది. కబళించేసేంతా కష్టమైన కదలకుండ ఉండదని, కాల గమనంతోపాటు మారిపోతుంది" అంటూ తన ఆత్మస్థైర్యాన్ని వ్యక్తం చేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు