HC Grants Damages To Prisoner: అధికారుల నిర్లక్ష్యం.. బెయిల్ వచ్చినా మూడేళ్లు జైళ్లోనే..

27 Sep, 2023 15:47 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. జైలు అధికారుల నిర్లక్ష్యం ఓ దోషి పాలిట శాపంగా మారింది. బెయిల్ వచ్చినప్పటికీ మూడేళ్లపాటు జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. లక్ష రూపాయల జరిమానా విధించింది. 

చందన్ జీ ఠాకూర్‌(27)కు ఓ కేసులో జీవితఖైదు శిక్ష పడింది. సెప్టెంబర్ 29, 2020న హైకోర్టు అతని శిక్షను నిలిపివేసింది. అందుకు సంబంధించిన ఆర్డర్ పత్రాలను హైకోర్టు రిజిస్ట్రీ మెయిల్‌ ద్వారా పంపించింది. ఆ మెయిల్ అటాచ్‌మెంట్‌ను జైలు అధికారులు ఓపెన్ చేయలేదు. దీంతో చందన్ ఠాకూర్ ఇప్పటివరకు జైలులోనే ఉండాల్సి వచ్చింది. బెయిల్‌ కోసం మళ్లీ కోర్టును సంప్రదించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. 

జైలు అధికారులు కోర్టు పంపిన ఆర్డర్ కాపీలను మెయిల్‌లో ఓపెన్ చేయలేదనే విషయం ఈ వ్యవహారంలో బయటపడింది. దీనికారణంగా చందన్ ఠాకూర్‌కు శిక్ష నుంచి విముక్తి కలిగినా.. ప్రయోజనం లభించలేదు. ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది. జైలు అధికారుల నిర్లక్ష‍్యానికి రూ.లక్ష రూపాయల జరిమానా విధించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. 

ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక

మరిన్ని వార్తలు