ఏంటి! చాయ్‌, సమోసా ధర 490 రూపాయలా.. షాకవుతున్న నెటిజన్లు..

29 Dec, 2022 13:48 IST|Sakshi

వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరికీ టీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఉదయం లేవగానే టీ తాగాల్సిందే లేదంటే ఏం తోచదు.  ఇంట్లో అయినా, బయట అయినా రోజుకు నాలుగు కప్పుల టీ అయినా లాగించేస్తుంటారు. ఇక చాయ్‌, సమోసా ఆ కాంబినేషనే వేరు. చాలా మంది టీ తాగిన తర్వాత స్నాక్స్‌లా సమోసా తింటుంటారు.  సాధారణంగా వీటి ధర కూడా ఎంతనుకున్న రూ. 50కు మించదు. అయితే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మాత్రం ధరలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. 

ముంబై ఎయిర్‌పోర్టులో రెండు సమోసా, ఒక చాయ్‌, ఒక వాటర్‌ బాటిల్‌ కొనుగోలు చేసినందుకు రూ. 499 బిల్‌ వేశారు.. ఈ విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు ఫరా ఖాన్‌ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. డిసెంబర్‌ 28న రెండు ఫోటోలను షేర్‌ చేస్తూ.. ముంబై చత్రపతి శివాజి మహారాజ్‌ ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టులో రెండు సమోసాలు, ఒక కప్‌ టీ, ఒక వాటర్‌ బాటిల్‌ ధర  490’ గా పేర్కొంది. దీనికి ‘మంచి రోజులు వచ్చాయి’ అనే క్యాప్షన్‌ పెట్టింది. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో 'అచ్ఛే దిన్ ఆనే వాలే హై' (మంచి రోజులు రాబోతున్నాయి' అని మోదీ చేసిన నినాదాన్ని గుర్తు చూస్తూ వ్యంగ్యంగా జర్నలిస్ట్‌ ఈ విధంగా క్యాప్షన్‌ జోడించింది.


ఇందులో ఇందులో సాధారణ సైజ్‌ కలిగిన రెండు సమోసాలు ఒక చాయ్‌ కప్పు కనిపిస్తోంది. చాయ్‌ సమోసాపై చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మిలియన్‌ వ్యూస్‌ రావడమే కాకుండా వేలల్లో లైక్‌లు వచ్చి చేరుతున్నాయి. అయితే ఈ పోస్టు చూసిన నెటిజన్లు ‘ముంబై కండివాలీ రైల్వే స్టేషన్‌లో 52 రూపాయలకు రెండు సమోసాలు, ఒక చాయ్, ఒక వాటర్ బాటిల్‌ దొరుకుతుంది’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. మరొకొందరు ‘ఏంటి విమానశ్రయంలో రెండు సమోసా, ఒక చాయ్‌, ఒక వాటర్‌ బాటిల్‌ రూ.490నా’ అంటూ షాక్‌ అవుతున్నారు.
చదవండి: ‘ముంబై మహారాష్ట్రదే.. ఎవడబ్బ సొత్తు కాదు’

మరిన్ని వార్తలు