భార్య ప్రేమను అర్థం చేసుకుని.. ప్రియునితో పంపించాడు!

24 Sep, 2023 11:52 IST|Sakshi

సినిమాను తలపించే కథ యూపీలోని దేవరియాలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఇటీవలే వేరొకరితో పెళ్లయిన తన ప్రియురాలిని కలుసుకునేందుకు ఆమె ఇంటికి వచ్చాడు.  విషయమంతా తెలుసుకున్న ఆ యువతి భర్త తన భార్యకు ఆమె ప్రియునితో వివాహం జరిపించాడు. ఈ ఉదంతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

దేవరియా జిల్లాలోని బరియార్‌పుర్‌ నగర్‌ పంచాయతీలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక యువకునికి ఏడాది క్రితం బీహార్‌లోని గోపాల్‌గంజ్‌ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ఒక యువతితో వివాహం జరిగింది. వీరి కాపురం అంతా సవ్యంగానే జరుగుతున్నదనుకునేంతలో ఉన్నట్టుండి ఆమె ప్రేమికుడు వారింటికి వచ్చాడు. దీనిని చూసిన చుట్టుపక్కలవారు అతడిని చితకబాదారు. అయితే ఇంతలో ఆమె భర్తకు గతంలో ఆ యువకునితో గల ప్రేమ వ్యవహారాన్ని చెప్పింది. వారి ప్రేమను అర్థం చేసుకున్న ఆమె భర్త ఆమెకు ప్రియునితో వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ముందుగా తన ఇంటిలోని వారిని, భార్య ఇంటిలోనివారిని ఒప్పించాడు. తరువాత ఒక ఆలయంలో తన భార్యకు ఆమె ప్రియునితో వివాహం జరిపించాడు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోపాల్‌ గంజ్‌ జిల్లాలోని రెడ్వరియా గ్రామానికి చెందిన ఆకాశ్‌ షా తమ పొరుగు గ్రామంలో ఉంటున్న యువతిని ప్రేమించాడు. వారిద్దరి మధ్య రెండేళ్ల పాటు ప్రేమాయణం సాగింది. ఏడాది క్రితం ఆమెకు వేరే యువకునితో వివాహం జరిగింది. అయితే ఆకాశ్‌ తన ‍ప్రియురాలిని మరచిపోలేక  రెండు రోజుల ‍క్రితం ఆమె ఉంటున్న ఇంటికి వచ్చాడు.  విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అతనిపై దాడి చేశారు. అయితే ఆమె భర్త విషయమంతా తెలుసుకుని తన భార్యకు ప్రియునితో వివాహం జరిపించాడు. 
ఇది కూడా చదవండి: భార్య డెలివరీ చూసి, మతిస్థిమితం కోల్పోయిన భర్త.. డబ్బుల కోసం డిమాండ్‌!

మరిన్ని వార్తలు