India, China Military Talks: అసంపూర్తిగానే సుదీర్ఘ సైనిక చర్చలు

11 Oct, 2021 10:50 IST|Sakshi

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లో మిగతా ప్రాంతాల్లోని ప్రతిష్టంభనపై భారత మరియు చైనా సైనిక కమాండర్ల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు భారత సైన్యం ప్రకటించింది. అయితే  భారత్‌–చైనా మధ్య 13వ దఫా  కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి సైనిక చర్చలు  చుషుల్‌–మోల్డో బోర్డర్‌ పాయింట్‌లో జరిగిన సంగతి తెలిసిందే.  ఈ మేరకు చైనా ప్రతిపాదనలను  భారత్‌ సైన్యం అంగీరించడానికీ ముందుకు వచ్చినా చైనా ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదని పేర్కొంది. ఈ సమావేశంలో తూర్పు లడఖ్‌లోని మిగతా ప్రాంతాల్లో సమస్యల పరిష్కార మార్గానికి భారత్‌ కొన్ని ప్రతిపాదనలు సూచించిన చైనా ఏ మాత్రం ఆమోదించడానికి మొగ్గు చూపలేదని స్పష్టం చేసింది.

(చదవండి: భారత స్పేస్‌ అసోసియేషన్‌ని ప్రారంభించనున్న మోదీ)

కాగా, సరిహద్దు ప్రాంతాల్లో ఘర్ణణ వాతావరణం ఏర్పడకుండా ఉండటానికీ సహకరిస్తామని ఇరు సైన్యాలు అంగీకరించినట్లు తెలిపింది. భారత్‌-చైనాల ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా సరిహద్దు సమస్యల పరిష్కారానికై కృషి చేస్తున్నమాని భారత్‌ పేర్కొంది. గోగ్రాలోని రిజల్యూషన్ ఆరు ఫ్లాష్‌పాయింట్‌లలో నాలుగింటిలో భారత్ , చైనాలు వెనక్కి తగ్గడానికి అంగీకరించాయి. అదేవిధంగా మిగిలిన గంగాన్,  పాంగాంగ్ సరస్సు  ఉత్తర,  దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లోని డిప్సాంగ్,  హాట్ స్ప్రింగ్స్‌లో చైనా బలగాలు వెనక్కి తగ్గి సహకరించాలని భారత్‌ ఒత్తిడి చేస్తోంది.

ఇటీవల చైనా సైన్యం వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను అతిక్రమించి ఉత్తరాఖండ్‌లోని బారాహోతి సెక్టార్, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే డెప్సాంగ్‌తో సహా మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాలు సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇదే అత్యుత్తమైన పరిష్కార మార్గం అని భారత్ నొక్కి చెబుతోంది. మే 5,2020న తూర్పు లడఖ్‌లో భారత్‌–చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన అనంతరం ఇరు దేశాల అధికారులు సంప్రదింపుల కారణంగా 12వ దఫా కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి చర్చలు ఈ ఏడాది జూలై 31న జరిగిన సంగతి తెలిసిందే . 

(చదవండి: "మేం ఒత్తిడికి తలొగ్గుతామని భ్రమపడొద్దు")

మరిన్ని వార్తలు