జనాన్ని హడలెత్తించిన ఏలియన్‌!?

18 Oct, 2020 11:16 IST|Sakshi
ఐరన్‌ మ్యాన్‌ బెలూన్‌తో పోలీసులు

నోయిడా : ఐరన్‌ మ్యాన్‌ సూట్‌ను పోలిన ఓ బెలూన్‌ నోయిడా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. అది ఏలియన్‌లాగా గాల్లోంచి నేలపై దిగటంతో జనం బిక్కచచ్చిపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రేటర్‌ నోయిడాలోని దాన్‌కౌర్‌ ప్రాంతంలో నిన్న ఉదయం ఓ వింత ఆకారం గాల్లో ఎగురుతూ కనిపించింది. కొంతసేపటి తర్వాత ఓ కాలువలోకి దిగి, అక్కడే కొద్దిసేపు కదులుతూ కనిపింది. దాని చూసిన జనం అది అచ్చం ఏలియన్‌ లాగానే ఉందంటూ.. కాదు, కాదు ఏలియనే అంటూ భయభ్రాంతులకు గురయ్యారు. ( స్వాతంత్య్ర సమర యోధుడికి తీవ్ర అవమానం )

ఆ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దాన్‌కౌర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ అనిల్‌కుమార్‌ పాండే అక్కడికి చేరుకున్నాక అసలు విషయం బయటపడింది. అది ఏలియన్‌ కాదని.. ఐరన్‌ మ్యాన్‌ను పోలి ఉన్న బెలూన్‌ అని ఆయన స్థానికులకు వివరించారు. బెలూన్‌ గాల్లోకి ఎగరటానికి ఆధారమైన గ్యాస్‌ తగ్గుతుండటంతో అది నేలపై పడిందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు